ఇటీవల తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ఫంగస్‌ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన బాధితుల సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ప్రతిరోజు రిపోర్టులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.
#BlackFungus
#Mucormycosis
#Telangana
#BlackFungusCasesInTelangana
#COVID19
#Fungus
#ICMR
#TelanganaHealthMinistry
#CMKCR
#Covid19Patients
#Disease